తమిళ అగ్ర నటుడు అజిత్ మాతృ వియోగానికి లోనయ్యారు. ఆయన తల్లి మోహిని మణి(85) శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బాధ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న అజిత్.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన చెన్నై బయల్దేరినట్టు తెలిసింది.
మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి కూడా మరణించారు. ఇప్పుడు తల్లి కూడా దూరం కావడంతో అజిత్ ఇంట్లో విషాదం నెలకొన్నది. అజిత్ తల్లి మృతి పట్ల తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.