కన్నుల పండువగా శ్రీనివాసమంగాపురం
‘తాతయ్య పుట్టినరోజు సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. నా తొలి సినిమా ‘శ్రీనివాసమంగాపురం’ నాకెంతో ప్రత్యేకం. ఇది ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర. మంచి కథతో నన్ను పరిచయం చేస్తున్న డైరెక్టర్ అజయ్‌భూపతికి, సి.అశ్వనీదత్‌గారికి థాంక్స్.
‘తాతయ్య పుట్టినరోజు సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. నా తొలి సినిమా ‘శ్రీనివాసమంగాపురం’ నాకెంతో ప్రత్యేకం. ఇది ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర. మంచి కథతో నన్ను పరిచయం చేస్తున్న డైరెక్టర్ అజయ్‌భూపతికి, సి.అశ్వనీదత్‌గారికి థాంక్స్. వెనకుండి ప్రోత్సహిస్తున్న మా బాబాయి మహేశ్‌బాబుకి ధన్యవాదాలు’ అని యువ హీరో ఘట్టమనేని జయకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాసమంగాపురం’. రషా తడానీ కథానాయిక. మోహన్‌బాబు కీలక పాత్రధారి. అజయ్‌భూపతి దర్శకుడు. వైజయంతీ మూవీస్ సి.అశ్వనీదత్, ఆనంది ఆర్ట్స్ జెమినీ కిరణ్ కలిసి నిర్మిస్తున్నారు.
శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా హీరోహీరోయిన్ల పాత్రలైన ‘శ్రీను, మంగా’లను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్లో హీరో ఘట్టమనేని జయకృష్ణ మాట్లాడారు. దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘సూపర్‌స్టార్‌కృష్ణ మనవడ్ని తెరకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. జయకృష్ణ హైలీ టాలెంటెడ్ యాక్టర్. అద్భుతంగా చేశారు.
స్క్రిన్ ప్రజెన్స్ అదిరిపోయింది. రషా తడానీ కూడా వెరీగుడ్ యాక్ట్రస్. జీవీ ప్రకాశ్‌కుమార్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది. ఎక్కువగా అవుడ్డోర్‌లోనే ఈ చిత్రం తెరకెక్కించాం. ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉంటుందీ సినిమా. చక్కటి ప్రేమకథగా ఆకట్టుకుంటుంది’ అని డైరెక్టర్ అజయ్‌భూపతి తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

