ఎయిర్ టెల్ న్యూ ప్లాన్ : ఒకే ప్లాన్ లో ముడు సేవలు…

ఢిల్లీ,జూలై 2: దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. “ఎయిర్టెల్ బ్లాక్”పేరుతో నూతన ప్లాన్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకే ప్లాన్ లో ఫైబర్, డీటీహెచ్,మొబైల్ కు సంబంధించిన సేవలు అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. భారతదేశంలో గృహాల కోసం మొట్టమొదటిసారిగా లభ్యమవుతున్న ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ గా “ఎయిర్టెల్ బ్లాక్” నిలవనున్నది.

హై స్పీడ్ డాటా అవసరాలు పెరగడమే కాకుండా,ఇంటి వద్దనే మెరుగైన వినోదం, సౌకర్యవంతమైన మొబైల్ కనెక్టివిటీ వంటివి సమగ్రమైన అవసరాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు వేర్వేరు బిల్లులను నెలలో పలు మార్లు చెల్లించాల్సి రావడం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోతే సేవలు నిలిచిపోతున్నాయి. వినియోగదారుల ఈ సమస్యలను పరిష్కరించడానికి ఫైబర్,డీటీహెచ్,మొబైల్ సేవలు మూడూ కలిపి అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది.
‘‘ఎయిర్టెల్ వద్ద మా వినియోగదారుల సమస్యలకు తగిన పరిష్కారాలను అందించే దిశగా మేము వేసిన మరో ముందడుగు ఎయిర్టెల్ బ్లాక్. సౌకర్యం,మనశ్శాంతిని కోరుకుంటున్న మా వినియోగదారుల అవసరాలను ఇది తీరుస్తుందని భారతీ ఎయిర్టెల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షస్వత్ శర్మ తెలిపారు.
ఎయిర్టెల్ బ్లాక్‌ను ఎలా పొందాలంటే..?
-ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ పొందవచ్చు.
-మీకు కావాల్సిన సేవలను బట్టి సొంత ప్లాన్ రూపొందించుకోవచ్చు.మీకు దగ్గరలోని ఎయిర్టెల్ స్టోర్ సందర్శిస్తే ఎయిర్టెల్ బ్లాక్ సేవలు పొందొచ్చు.
లేదంటే 88266 55555కు మిస్డ్‌కాల్ ఇవ్వండి. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్‌లు మీరుఎయిర్టెల్ బ్లాక్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు సహాయపడతారు.
-మరింత సమాచారం కోసం https://www.airtel.in/airtel-black చూడొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

