పెట్రో ధరలకు బ్రేక్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణమా..?

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వారం రోజులకుపైగా అంటే దాదాపు గత 10 రోజుల నుంచి పెట్రో ధరలు పెరుగకుండా నిలకడగా ఉన్నాయి. రెండు నెలలకుపైగా జనాన్ని బెంబేలెత్తించిన పెట్రో ధరలకు ఉన్నట్టుండి బ్రేక్ పడటానికి కారణం ఏమై ఉంటుంది..? పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ధరల పెంపునకు బ్రేక్ పడిందా..? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలను ధరలు పెంచకుండా నియంత్రించిందా..? అంటే ఔననే సమాధానం వస్తున్నది. వివిధ జాతీయ పత్రికల్లో ప్రచురితమైన నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
జనవరి నెల నుంచి విరామం లేకుండా పెరిగి సామాన్యుడి నడ్డి విరిచిన పెట్రో ధరలు గత 9 రోజులలో ఒక్క రూపాయి కూడా పెరుగలేదు. గత రెండు నెలల వ్యవధిలో వరుసగా తొమ్మిది రోజులు పెట్రో ధరలు పెరుగని సందర్భమే లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారే జోక్యం చేసుకుని చమురు సంస్థలను నియంత్రించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
2018 లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇంధన ధరలు వేగంగా పెరిగాయి. ఏకంగా 55 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇంధన రిటెయిలర్లు ఎన్నికల సమయమైన ఏప్రిల్ 24 నుంచి మే 13 వరకు 19 రోజులపాటు ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచారు. పోలింగ్ ముగిసిన రెండు రోజులకే తిరిగి ధరల వడ్డన పునఃప్రారంభించారు. అయితే, ఆయిల్ కంపెనీలు మాత్రం ప్రభుత్వాల జోక్యం ఉండవచ్చునన్న వాదనను కొట్టిపారేస్తున్నాయి. ప్రజా ప్రయోజనార్థమే ధరలు నిలువరించినట్లు చెబుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

