Dalitha bandhu | దళితబంధును అడ్డుకుంటే కాంగ్రెస్ భరతం పడతాం.. లబ్ధిదారుల వార్నింగ్
Dalitha bandhu | నిరుపేద ఎస్సీల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సర్కారు తెచ్చిన దళితబంధును అడ్డుకుంటే సహించబోమని లబ్ధిదారులు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అనర్హులకు పథకాలు ఇచ్చారని మంథని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు.
మంథని, సెప్టెంబర్ 1 : నిరుపేద ఎస్సీల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సర్కారు తెచ్చిన దళితబంధును అడ్డుకుంటే సహించబోమని లబ్ధిదారులు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అనర్హులకు పథకాలు ఇచ్చారని మంథని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు పార్టీలకతీతంగా దళితబంధు కింద రూ. 10లక్షల సాయం చేస్తున్నదని తెలిపారు. కానీ ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వారు తాము అర్హులమో కామో..తమ ఇండ్లకు వస్తే తెలుస్తుందన్నారు. అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపికచేశారని స్పష్టం చేశారు.
కానీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తూ గొప్ప పథకాన్ని ఆపివేయించేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. లేదంటే తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు బడికెల సతీశ్, కాశిపేట సమ్మయ్య, చంద్రశేఖర్, వెల్పుల శ్రావణ్, వెంకటేశ్, పీక మల్లయ్య, చెన్నూరి అశోక్, బూడిద వెంకటయ్య, బూడిద సమ్మయ్య, నారపల్లి సమ్మయ్య, మంథని రాజపోచం, మంథని కిష్టయ్య, మంథని సుధాకర్, రవి, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

