తిరువనంతపురం : మలప్పురంలోని ఫుట్‌బాల్ మైదానంలో కుప్పకూలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మళయాళ నటుడు మాముక్కోయ (76) ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
నటుడు సోమవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫుట్‌బాల్ మైదానానికి రాగా, పెద్ద సంఖ్యలో జనం సెల్ఫీల కోసం ఆయన చుట్టూ మూగడంతో అసౌకర్యానికి గురై మైదానంలోనే కుప్పకూలారు. మాముక్కోయను కోజికోడ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన మాముక్కోయ ఆపై మళయాళ సినీ పరిశ్రమలోకి అడుడగుపెట్టి ప్రముఖ కమెడియన్, నటుడిగా ఎదిగారు.
450కిపైగా సినిమాల్లో నటించిన మముక్కోయకు పలు అవార్డులు లభించాయి. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తొలుత మాముక్కోయ గుండెపోటుకు గురయ్యారనే వార్తలు వచ్చినా వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కోజికోడ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని చెబుతున్నారు.
Read More