ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఆ ఫిల్మ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇటీవల ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. దానిపై బాలీవుడ్ స్టార్ హీరో స్పందించారు. మీడియాతో ఇంటెరాక్ట్ అయిన సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. లాల్ సింగ్ చద్ధాపై ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన తీరు బాధను కలిగించిందన్నారు. తాను ఇండియాను లైక్ చేయనని కొందరు తమ మనసులో అనుకుంటున్నారని, కానీ దాంట్లో నిజం లేదని, వాళ్లు ఆలోచిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. తన ఫిల్మ్‌ను ఎవరూ బాయ్‌కాట్ చేయవద్దు అని ఆమిర్ ఖాన్ కోరాడు. అందరూ ఈ సినిమాను చూడాలని వేడుకున్నాడు. హాలీవుడ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్ సింగ్ చద్దాను రూపొందిస్తున్నారు. అద్వైత్ చందన్ దీన్ని డైరెక్ట్ చేశారు. కరీనా కపూర్, మోనా సింగ్ ఇందులో నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా దీంట్లో పాత్ర పోషిస్తున్నాడు.