అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్‌ను కలిచివేసింది. దానికి ప్రాణం పోసి ఎక్కడో చోట సజీవంగా నిలబెట్టాలని సంకల్పించాడు. కొందరి సహకారంతో అనుకున్నది సాధించాడు. మరి అంతపెద్ద మర్రిచెట్టును ప్రకృతి ప్రకాశ్ ఎలా బతికించాడో తెలుసుకుందాం పదండి..