కలిసి తినడంలో ఆనందం ఉంది. కలిసి వండుకుని తినడంలో ఆనందంతో పాటు సంతృప్తి కూడా ఉంటుంది. కమ్మని జ్ఞాపకంగానూ మిగిలిపోతుంది. కాబట్టే, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మారియట్ హోటల్స్ ఓ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేమికులు కలిసి వంట చేసుకునేందుకు వీలుగా ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ కిట్లు సిద్ధంచేసింది. యూరోపియన్ వంటకాల నుంచి భారతీయ రుచుల వరకూ ఏదైనా వండుకోవచ్చు. కిచెన్‌లో ఉన్నప్పుడు ఏదైనా సందేహం వస్తే.. తీర్చుకోవడానికి సీనియర్ షెఫ్‌లు ఆన్లైన్లో అండగా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రియమైన వారితో కలిసి ప్రేమారా విందులు సిద్ధం చేయండి. వివరాలకు MarriottBonvoyonWheels.comను సందర్శించండి.