డ్రంక్ అండ్ డ్రైవ్.. 91 మందికి జైలు

హైదరాబాద్ : తాగి వాహనాలు నడిపిన 91 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్ణీత మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలను నడిపిన 159 మంది వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని గురువారం స్థానిక కోర్టులో హాజరు పరచగా 91 మందికి న్యాయస్థానం ఒక రోజు నుండి గరిష్ఠంగా 22 రోజుల జైలు శిక్ష విధించింది. జరిమానాలుగా మొత్తం రూ.6.8 లక్షలను విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా రాజేంద్రనగర్‌లో 49 మంది, మాదాపూర్‌లో 14, షాద్‌నగర్‌లో 10, గచ్చిబౌలిలో 9, బాలానగర్‌లో 9 మంది పట్టుబడ్డారు. వీరందరి డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్ కోరుతూ రిజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీకి పంపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

