పాలక్కాడ్: ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కేరళ కోర్టు 90 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. పాలక్కాడ్ జిల్లాలోని కరింబా గ్రామంలో ఆ వృద్ధుడు మైనర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి సతీశ్ కుమార్ ఈ కేసులో తీర్పునిస్తూ ఆ వృద్ధుడికి 50 వేల జరిమానా విధించాడు. 2020లో పక్కింట్లోని 15 ఏళ్ల అమ్మాయిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వృద్ధుడికి శిక్ష వేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిషా విజయ్‌కుమార్ తెలిపారు. సెక్షన్ 7 ప్రకారం మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష పడడం ఖాయం. సుమారు 9 మంది సాక్ష్యుల్ని విచారించిన తర్వాత లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.