83 movie in OTT | బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 83. పసికూనగా ఉన్న టీమిండియా 1983లో తొలిసారిగా క్రికెట్ వరల్డ్‌కప్ ఎలా గెలిచిందన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కపిల్‌దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, పాంథమ్ సినిమాస్ తో కలిసి దీపికా పదుకొణే సంయుక్తంగా నిర్మించింది. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కలెక్షన్లను సాధించలేకపోయింది. పోటీగా పుష్ప సినిమా ఉండటంతో 83 సినిమా కలెక్షన్లకు తొందరగానే తెరపడింది. 83 చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేశాడు. కాగా 83 చిత్రం త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన నెట్ ఫ్లిక్స్ మరియు డిస్నీ హాట్ స్టార్ లలో ఫిబ్రవరి 18 నుంచి 83 సినిమా స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవ్వగా..డిస్నీ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకోణె రోమి భాటీయాగా నటించింది. తమిళ హీరో జీవా కీలకపాత్రలో నటించాడు.