పంచాయతీ ఎన్నికలు.. 45 ఏళ్ల వయసులో పెళ్లి
పంచాయతీ ఎన్నికలు | ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేళ.. 45 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే అతను నివసిస్తున్న

లక్నో : ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేళ.. 45 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే అతను నివసిస్తున్న గ్రామపంచాయతీని మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో అతను పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మంచి ముహుర్తం లేనప్పటికీ మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు.
బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) దశాబ్ద కాలంగా సోషల్ సర్వీసు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనను విజయం వరించలేదు. గ్రామం అభివృద్ధికి పాటు పడుతున్న అతను ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. కచ్చితంగా హథీ సింగ్ భార్యనే గెలిపిస్తామని గ్రామస్తులు అంటున్నారు.
ఈ సందర్భంగా హథీ సింగ్ మాట్లాడుతూ.. తన గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన భార్య డిగ్రీ పట్టభద్రురాలు అని తెలిపాడు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు.
ఇవీ కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
టీకా తీసుకున్న గంగవ్వ.. నొప్పికి గట్టిగా కేకలు
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు అవకాశం!
పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

