RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
RRB Jobs | నిరుద్యోగులకు రైల్వే సువర్ణావకాశం కల్పించింది. వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆర్ఆర్బీ విడుదల చేసింది. డిగ్రీ, అండర్గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సికింద్రాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.
RRB Jobs | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా 3548 పోస్టులను నింపనుంది. వీటిలో గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులు 3548 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా 1688 అండర్గ్రాడ్యుయేట్ (12th Level) ఖాళీలను కూడా భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టుల వివరాలు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్- 127
గూడ్స్ ట్రైన్ మేనేజర్- 2750
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- 300
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 371
RRB రీజియన్ల వారీగా ఖాళీలు
సికింద్రాబాద్- 56
కోల్‌కతా- 332
బిలాస్‌పుర్- 542
రాంచీ- 377
బెంగళూరు- 356
అజ్మేర్- 304
మాల్దా- 26
ముంబై- 156
అహ్మదాబాద్- 19
భోపాల్- 157
భువనేశ్వర్- 146
చండీగఢ్- 59
గోరఖ్‌పుర్- 30
ప్రయాగ్‌రాజ్- 265
గువాహటి- 104
తిరువనంతపురం- 25
జమ్మూకశ్మీర్- 66
పట్నా- 29
ముజఫర్‌పుర్- 78
సిలిగురి- 291
ఈ 3548 ఖాళీల్లో జనరల్‌కు 1517, ఓబీసీ (Non-Creamy Layer)లకు 873, ఎస్సీలకు 553, ఎస్టీలకు 300 కేటాయించారు.

Posts Rrb
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యార్హత దరఖాస్తు చివరితేదీ నాటికి పూర్తి చేయాలి. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు అనర్హులు.
వయసు
2027, జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్‌కు 3, ఓబీసీలకు 6, ఎస్సీ, ఎస్టీలకు 8, దివ్యాంగులు జనరల్‌కు 10, ఓబీసీలకు 13, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు కల్పించారు.
ఎంపిక
కంప్యూటర్ ఆధారిత (CBT 1, 2) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
సీబీటీ-1 పరీక్ష 100 ప్రశ్నలు (జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30), 100 మార్కులకు ఉంటుంది. సమయం 90 నిమిషాలు. 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంది.
సీబీటీ-2 పరీక్ష 120 ప్రశ్నలు (జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35), 120 మార్కులకు ఉంటుంది. సమయం 90 నిమిషాలు. 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంది.
ఫీజు
రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు, ఈబీసీలకు రూ. 250. సీబీటీ-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ ఫీజు రీఫండ్ చేస్తారు.
జీతం
ఎంపికైనవారికి నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు రూ. 35,400, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌లకు రూ. 29,200.
చివరితేదీ
అభ్యర్థులు ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు చేస్తే వాటిని తిరస్కరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ నవంబర్ 6. ఇతర వివరాలకు వెబ్సైట్ www.rrbapply.gov.inలో చూడండి.

Apply
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

