క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ టామ్ లాథమ్ (252; 34 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ 521/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లాథమ్ వీర విహారం చేయగా.. కాన్వే (109) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఏస్ పేసర్ ట్రెంట్ బోల్ట్ (5/43) ధాటికి 126 పరుగులకే ఆలౌటైంది.