ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,974 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 3,290 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,974 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 3,290 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 1,05,024 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 17 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,40,096కు పెరిగింది. ఇందులో 19,02,256 మంది కోలుకున్నారు. కరోనాతో 13,132 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో అత్యధికంగా తూ.గో. జిల్లాలో 577, చిత్తూరులో 501, ప్రకాశంలో 349, కృష్ణాలో 311 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో 1.86కోట్ల కొవిడ్ టీకా మోతాదులు పంపిణీ చేయగా.. ఇందులో మహిళలకు కోటికిపైగా డోసులు అందించినట్లు వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

