Jobs | యూఐఐసీలో 225 అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాళీలు.. సెప్టెంబర్ 28 చివరితేదీ
Jobs | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టులు, అర్హతలు, ఎంపిక తదితర వివరాలు తెలుసుకుందాం.
Jobs | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) భారత ప్రభుత్వ యాజమాన్యం నిర్వహించే ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థ UIIC AO నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది. దీని ద్వారా జనరలిస్ట్, స్పెషలిస్ట్ విభాగాల్లో 225 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి స్కేల్-1 పోస్టులు. వీటి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అర్హులైనవారు వెబ్సైట్ uiic.co.inలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్స్)- 200 (UR-68, OBC-62, EWS-22, SC-30, ST-18; PwBD horizontal: VI-2, HI-2, OC-4, MD/ID-3)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (హిందీ ఆఫీసర్స్)- 25 (UR-11, OBC-7, EWS-2, SC-4, ST-1; PwBD horizontal: VI-1)

Uiic Posts
అర్హతలు
అభ్యర్థులు తప్పనిసరిగా UGC/AICTE ఆమోదంతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10+2+3 లేదా తత్సమాన కోర్సు, పీజీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అనుభవం కూడా ఉండాలి.
వయసు
ఈ ఏడాది జూన్ 30 నాటికి 21 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10, ఎక్స్సర్వీస్మెన్లకు 5, వితంతు, విడాకులు తీసుకున్న, చట్టపరంగా విడిపోయి మళ్లీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలకు 9 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 1000 + జీఎస్టీ చార్జీలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 250 + జీఎస్టీ చార్జీలు.

Exam
ఎంపిక
ఆన్లైన్ రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి జీతం నెలకు రూ. 1,10,000 ఉంటుంది.
చివరితేదీ
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 30. ఇతర వివరాలకు వెబ్సైట్ https://uiic.co.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

