158 డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్.. రష్యా దాడిలో 16 మంది మృతి
Ukraine: దాదాపు 158 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఒకే సారి అనేక లొకేషన్లను రష్యా టార్గెట్ చేసిందని, ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని ఉక్రెయిన్ చెప్పింది.
కీవ్: ఉక్రెయిన్‌పై ఇవాళ రష్యా విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాలపై రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. భీకరంగా జరిగిన ఆ దాడుల్లో సుమారు 16 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. దాదాపు 158 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఒకే సారి అనేక లొకేషన్లను రష్యా టార్గెట్ చేసిందని, ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని ఉక్రెయిన్ చెప్పింది. తమ వద్ద ఉన్న అని రకాల ఆయుధాలను రష్యా వాడినట్లు తెలుస్తోంది. ఇండ్లు, మెటర్నటీ ఆస్పత్రులను రష్యా టార్గెట్ చేసిందని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్, లివివ్, ఒడిసా, జపొరిజియా, దినిప్రో, ఖార్కివ్ పట్టణాలను లక్ష్యం చేస్తూ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. గత వారం క్రిమియా పోర్టు ఫియోడోసియాలో ఉన్న రష్యా యుద్ధ నౌకను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఆ ఘటనకు ప్రతీకరంగా రష్యా ఇవాళ ప్రతిదాడి చేసినట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- drones
- Kyiv
- missile strikes
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

