Vandan Alankar Sawai : చదరంగంలో భారత కుర్రాళ్లు అసమాన విజయాలతో దూసుకెళ్తున్నారు. గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ ఎరిగేసి వంటి వారు ఇప్పటికే తామేంటో నిరూపించుకోగా.. 15 ఏళ్ల వందన్ అలంకార్ సవాయ్(Vandan Alankar Sawai) వీరి సరసన చేరాడు. అలాఅనీ అతడేమీ తాజాగా ఏ టోర్నీలోనో విజేతగా నిలవలేదు. కానీ.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి వార్తల్లో నిలిచాడీ యువ సంచలనం.
పదిహేనేళ్ల భారత కుర్రాడి చేతిలో వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ కంగుతిన్నాడు. కేవలం 50 ఎత్తుల్లోనే చెస్ దిగ్గజాన్ని చిత్తు చేశాడు వందన్ అలంకార్ సవాయ్ అనే పిల్లాడు. అయితే..ఇంతటి గొప్ప విషయాన్ని అతడు తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. చివరకు వాళ్లే తమ కుమారుడు కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసి ఉప్పొంగిపోయారు.
Indian 15-year-old stuns Magnus Carlsen in 50 moves, says “was shocked” when chess great blundered#MagnusCarlsenhttps://t.co/paZBapnfcg pic.twitter.com/WOrnp9qMIu
— NDTV Sports (@Sports_NDTV) August 25, 2026
చెస్.కామ్(Chess.com)వీక్లీ టైటిల్డ్ మంగళవారం ఈవెంట్లో.. ఈఎల్వో రేటింగ్ 2,288 ఉన్న వందన.. లెజెండరీ ఆటగాడైన కార్ల్‌సన్‌పై పైచేయి సాధించి ఔరా అనిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వందన్.. అత్యుత్తమ ఆటగాడైన కార్ల్సన్ పొరపాటు చేయడంతో తాను షాకయ్యానని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో మాస్టర్‌గా అవతరించడమే నా లక్ష్యం. ఇప్పటికే నా వయసు వారు గ్రాండ్‌మాస్టర్లు అయ్యారు. నేను కూడా ఏదో ఒకరోజు ఆ హోదా అందుకుంటా. అప్పటివరకూ నేను చరిత్ర, రాజనీతి శాస్త్రంపై దృష్టి సారిస్తాను అని వందన్ పేర్కొన్నాడు.