కావలసిన పదార్థాలు:
ఓట్స్: పావు కప్పు, బ్రెడ్: ఆరు, నెయ్యి: ఒక టీస్పూన్, గడ్డ పెరుగు: ఒక కప్పు, క్యాప్సికమ్ తురుము: రెండు టీస్పూన్లు, క్యారెట్ తురుము: 3 టీ స్పూన్లు, వేయించిన జీలకర్ర: చిటికెడు, టమాటా సాస్: ఒక టీస్పూన్, కొత్తిమిర: కొద్దిగా, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత, వెన్న: 4 టీస్పూన్లు
తయారీ విధానం:
ముందుగా పెరుగును ఒక బట్టలో కట్టి, నీరంతా పోయేవరకు వేలాడదీయాలి. ఓట్స్‌ను దోరగా వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారెట్, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు,
జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలియబెట్టాలి. బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి పలుచగా వెన్న రాసి దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి, వెన్న రాసిన మరో బ్రెడ్‌తో మూసేసి, వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ.. రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకుంటే చాలు. వేడివేడి ఓట్స్ శాండ్ విచ్ సిద్ధం.