తెలంగాణ జానపదుల నోటి నుంచి జాలువారే విలువైన సామెతల్లో ఇదొకటి. ప్రస్తుత లోకం తీరూ ఈ సామెతలాగే ఉంది. ఎవరైనా సదుద్దేశంతో బీదలు, అన్నార్థులకు సాయం చేస్తుంటే.. కడుపునిండినోడు వచ్చి నాక్కూడా కావాలని చేతులు చాచే స్థితిని ‘ఇచ్చెటోణ్ని జూస్తే, సచ్చెటోడు లేచొస్తడు’ సామెతతో చాలా వ్యంగ్యంగా చెప్పారు జానపదులు. ఎవరికి చెందాల్సిన దాన్ని వారికే చెందనిస్తే.. అట్టడుగు వర్గాల వారు కూడా రాశిలోకి వస్తారు. పేదలకు పెట్టేదాంట్లో సంపన్నులు వాటా కోరడంలో అర్థం లేదు.