Russia – Ukraine Conflict | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ భేరి మోగించింది ! మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కాసేపటికే.. యుద్ధ ట్యాంకులు, మిలటరీ దాడులు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ( volodymyr zelensky ) ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలతో పాటు తాను కూడా కదనరంగంలోకి కాలుమోపారు. ఇలా మిలటరీ డ్రెస్ వేసుకుని.. ఆర్మీ ఫ్రంట్‌లైన్‌ను సందర్శించారు.