Plane Crash | విమాన ప్రమాదంలో భారతీయ బిలియనీర్ సహా ఆరుగురు దుర్మరణం
Plane Crash | జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలినియర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు.
Plane Crash | జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలియనీర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అలాగే నికెల్, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్ జెట్‌లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని సెసెనా 206గా గుర్తించారు. ఈ సింగిల్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు. సాంకేతిక లోపంతో విమానం గాల్లో ఉన్న సమయంలోనే పేలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో హర్పాల్‌తో పాటు ఆయన తనయుడు, మరో నలుగురు మృతి చెందారని.. రంధావా స్నేహితుడు, సినీ నిర్మాత హోప్వెల్ చినోనో తెలిపారు. అలాగే కంపెనీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. విమాన ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

