Kangana Ranaut | ‘మీ కామెంట్స్‌కు అర్థం ఏమిటి..?’.. కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు
Kangana Ranaut | బాలీవుడ్ నటి (Bollywood actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) కు సుప్రీంకోర్టు (Supreme Court) చురకలు వేసింది. తనపై నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కంప్లయింట్ (Criminal Defamation complaint) ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
Kangana Ranaut : బాలీవుడ్ నటి (Bollywood actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) కు సుప్రీంకోర్టు (Supreme Court) చురకలు వేసింది. తనపై నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కంప్లయింట్ (Criminal Defamation complaint) ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
కంగనా తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దాంతో కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్ కౌర్ అనే వృద్ధ మహిళను కించపర్చేలా రీట్వీట్ చేశారు. ఆమె రూ.100 కిరాయికి వస్తుందని తన రీట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో మహిందర్ కౌర్ పరువునష్టం కేసు వేశారు.
దాంతో కౌర్ ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమెకు చీవాట్లు పెట్టింది. ‘మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి..? మీది సింపుల్ రీట్వీట్ కాదు. మీరు మీ సొంత కామెంట్స్ చేశారు. మసాలా జోడించారు’ అని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దాంతో తన క్లయింట్ ఆ రీట్వీట్‌పై క్లారిఫికేషన్ ఇచ్చారని కంగనా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ క్లారిఫికేషన్ ట్రయల్ కోర్టుకు ఇవ్వండని ధర్మాసనం సూచించింది. కంగనా పంజాబ్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయవాది చెప్పగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరవచ్చని కోర్టు పేర్కొంది. న్యాయవాది మరేదో వాదన చేయబోతుండగా.. ‘ఆమె ట్వీట్‌పై మా స్పందన కోరే ప్రయత్నం చేయకండి’ అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

