Bengaluru Traffic | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ట్రాఫిక్‌లో వంట కూడా చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు వ్యంగ్ంయగా పేర్కొన్నారు.
షాపింగ్‌కు వెళ్లేంత సమయం..
బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకొన్న దీపాంశుకు ఆయనేదో షాపింగ్‌కు వెళ్లినట్టు ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్‌మాల్ పక్కన ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడమే అందుకు కారణం.
సమస్య పరిష్కరించడంలో విఫలం…
గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆపరేషన్ కలమం, ఆపరేషన్ హస్త అంటూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధలో కాస్త ప్రజల కష్టాలు తీర్చడంలో చూపాలని మండిపడుతున్నారు.