వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం.. పోటీపడి వీక్షించిన జనం
Solar Eclipse | ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే చాలా ఏండ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ కనిపించదట.
భారత దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవాళ్టి గ్రహణం భారత్‌లోని జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లో కనిపించింది. సరిగ్గా ఇవాళ సాయంత్రం 4.29 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. సాయంత్రం 6.26 గంటల వరకు కొనసాగింది.
హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్‌కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబైలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్‌పూర్‌లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

