Nirmala Sitharaman | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ..
Nirmala Sitharaman | అమెరికా వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణల సహా పలు అంశాలపై చర్చించారు.
Nirmala Sitharaman | అమెరికా వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణల సహా పలు అంశాలపై చర్చించారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా నిర్మలా సీతారామన్, అజయ్ బంగా ప్రపంచ పబ్లిక్ గూడ్స్ ప్రైవేట్ క్యాపిటల్ భాగస్వామ్యం, ఇంధన భద్రత, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (MDBs) సంస్కరణలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సంస్కరణలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ (IEG) సిఫారసులపై సాధించిన పురోగతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్నారు. భవిష్యత్తులో సిఫార్సుల అమలును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు.
2023 జీ-20 భారత్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్.. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సంస్కరణ కోసం సిఫారసులు చేసింది. పేదరికాన్ని అంతం చేయడం, భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహించడం, 2030 నాటికి ప్రపంచ ప్రజా వస్తువుల కోసం స్థిరమైన రుణస్థాయిలను మూడురెట్లు పెంచేందుకు దోహదం చేయాలని.. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఎజెండాలోని అంశాలకు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడే పెట్టుబడిదారులతో ఉద్దేశపూర్వకంగా పాల్గొనేందుకు అనువైన, వినూత్నమైన ఏర్పాట్లను అనుమతించే మూడో ఫైనాన్సింగ్ మెకానిజం రూపొందించాలని సిఫారసు చేసింది. బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా చర్చించేందుకు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంయుక్తంగా నిర్వహించే కన్సల్టేటివ్ మెకానిజంపై విస్తృత సంప్రదింపుల ప్రక్రియ అవసరమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

