Swati Maliwal | ఆసుపత్రి నేలపైనే నిద్రించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్..
Swati Maliwal | ఓ ప్రభుత్వ అధికారి చేతిలో అత్యాచారానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక (17)ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) చీఫ్ స్వాతి మాలివల్ (Swati Maliwal).. ఆసుపత్రిలోని నేలపైనే రాత్రంతా నిద్రించారు.
Swati Maliwal | ఓ ప్రభుత్వ అధికారి చేతిలో అత్యాచారానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక (17)ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) చీఫ్ స్వాతి మాలివల్ (Swati Maliwal).. ఆసుపత్రిలోని నేలపైనే రాత్రంతా నిద్రించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధితురాలిని, ఆమె తల్లిని కలవడానికి తనను అనుమతించడం లేదని ఆరోపించారు.
‘ఢిల్లీ పోలీసులు గూండాయిజానికి పాల్పడుతున్నారు. బాలికను, ఆమె తల్లిని కలవడానికి నన్ను అనుమతించడం లేదు. ఢిల్లీ పోలీసులు ఏం దాచాలనుకుంటున్నారో నాకు అర్థం కావడంలేదు. బాధిత బాలికను, ఆమె తల్లిని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) చైర్పర్సన్ కలవగలిగినప్పుడు.. నన్నెందుకు అనుమతించడం లేదు..?’ అని స్వాతి మాలివల్ ప్రశ్నించారు.
కాగా, బాధిత బాలికను కలిసేందుకు సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లిన స్వాతి మాలివల్ను పోలీసులు అనుమతించలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె అక్కడే ఉన్నారు. అత్యాచార బాధితురాలిని కలిసేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. బాలికకు అవసరమైన సహాయం, సరైన చికిత్స అందుతుందో లేదో తెలుసుకునే దాకా అక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె రాత్రంతా ఆసుపత్రి నేలపైనే పడుకున్నారు.
సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రమోదయ్ ఖాకా బాధిత బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మైనర్ తండ్రి 2020 అక్టోబర్‌లో చనిపోవడంతో అప్పటి నుంచి ఆ బాలిక ప్రమోదయ్ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో 2020 నవంబర్ నుంచి 2021 జనవరి వరకు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చినట్లు తెలియగానే.. నిందితుడి భార్య ఆ బాలికకు మెడిసిన్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సదరు అధికారిపై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రిపోర్టు ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
Also Read..
Seema Haider | ప్రధాని మోదీ, అమిత్ షాకు రాఖీలు పంపనున్న పాక్ జాతీయురాలు సీమా హైదర్
Onions | అలాంటివారు 4 నెలలు ఉల్లి తినకుంటే ఏమవుతుంది..? మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Chandrayaan-3 | 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్.. పిక్స్ షేర్ చేసిన ఇస్రో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

