లక్నో: రాఖీ సందర్భంగా ఒక బీజేపీ మేయర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఊహించని విధంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. చీరల కోసం వారు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తోపులాట జరుగడంతో కొందరు మహిళలు స్పృహ కోల్పోగా చాలామంది గాయపడ్దారు. (Women Faint) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. బరేలీ బీజేపీ మేయర్ ఉమేష్ గౌతమ్ రక్షాబంధన్‌కు ఒక రోజు ముందు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం బరేలీ క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమం కోసం 20,000 మందికిపైగా మహిళలు తరలివచ్చారు. పిల్లలు, కుటుంబంలోని వృద్ధులతో కలిసి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
కాగా, బరేలీ బీజేపీ మేయర్ ఉమేష్ గౌతమ్‌కు రాఖీలు కట్టేందుకు మహిళలకు ముందుగానే కూపన్లు పంపిణీ చేశారు. అయితే వారు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రౌండ్లో కనీసం నిల్చోవడానికి కూడా చోటు లేనంత పరిస్థితి ఏర్పడింది. చాలా మంది మహిళలు బారికేడ్లను దాటుకుని వేదిక వైపు వెళ్లారు. తీవ్ర ఎండ, ఉక్కపోత మధ్య మహిళల సంఖ్య పెరుగడంతో పరిస్థితి అదుపుతప్పింది.
మరోవైపు పంపిణీ చేస్తున్న చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తోపులాట జరుగడంతో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. పలువురు గాయపడ్డారు. స్పృహ కోల్పోయిన, గాయపడిన మహిళలను అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు మహిళలు మండిపడ్డారు.
అయితే ఈ కార్యక్రమం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీస్ అధికారి తెలిపారు. అలాగే తోపులాటలో మహిళలు స్పృహ కోల్పోవడం, గాయపడటం గురించి ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా నమోదు కాలేదని చెప్పారు. కాగా, మహిళల తోపులాట, స్పృహ కోల్పోవడం, గాయపడిన సంఘటనలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
जनता मूर्ख है
घर में भाई बहन है वहा राखी नही बांधेगी पहुंच जाएंगी नेता जी के महल में भुक्तो रोने से कोई फायदा नही
उत्तर प्रदेश के बरेली में बीजेपी मेयर डॉ. उमेश गौतम और उनके बेटे के पार्थ फाउंडेशन द्वारा आयोजित रक्षाबंधन कार्यक्रम में भारी भीड़ और अव्यवस्था के कारण भगदड़ मच… pic.twitter.com/pWuAxdZR19
— Tapasya Deva (@tapasy_dev1a_) August 28, 2026
बरेली में मेयर डॉ. उमेश गौतम के रक्षाबंधन कार्यक्रम के दौरान भीषण अव्यवस्था और भगदड़ की स्थिति बनने से एक महिला की मौत हो गई, जबकि कई महिलाओं की तबीयत बिगड़ गई.
कूपन के लालच में लगभग 20,000 महिलाएं पहुंच गईं.महिलाओं के कारण मैदान में भारी धक्का-मुक्की शुरू हो गई.
भगदड़ के दौरान… pic.twitter.com/T5EreD1Gn3— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 27, 2026