Cauliflower | కాలీఫ్లవర్ తెంపిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి, కొట్టిన కుమారుడు
Cauliflower | ఓ యువకుడు తన తల్లి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తన పొలంలో నుంచి కాలీఫ్లవర్ తెంపిందని తల్లిని కుమారుడు స్తంభానికి కట్టేసి, తీవ్రంగా చితకబాదాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కియోంఝార్ జిల్లాలో వెలుగు చూసింది.
Cauliflower | భువనేశ్వర్ : ఓ యువకుడు తన తల్లి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తన పొలంలో నుంచి కాలీఫ్లవర్ తెంపిందని తల్లిని కుమారుడు స్తంభానికి కట్టేసి, తీవ్రంగా చితకబాదాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కియోంఝార్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కియోంఝార్ జిల్లాలోని సరసపాసి గ్రామానికి చెందిన ఓ 70 ఏండ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమారులు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే చిన్న కుమారుడి పొలంలోకి వెళ్లిన తల్లి.. అక్కడున్న కాలీఫ్లవర్‌ను తెంపి ఇంటికి తీసుకొచ్చింది. తన అనుమతి లేకుండా కాలీఫ్లవర్ ఎందుకు తెంపావని తల్లిని కుమారుడు నిలదీశాడు. అంతటితో ఆగకుండా ఆ వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా చితకబాదాడు.
వృద్ధురాలిని కాపాడబోయిన స్థానికులను కూడా బెదిరించాడు. అయినప్పటికీ స్థానికులు ఆమెను ప్రాణాలతో రక్షించారు. అనంతరం బాధితురాలిని బసుదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

