Watch: దుండగుల కిడ్నాప్ యత్నం.. తృటిలో తప్పించుకున్న మహిళ
నలుగురు వ్యక్తులు మెల్లగా ఆ కారును సమీపించారు. డోర్లు తీసి అందులోకి ఎక్కి ఆ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
చండీగఢ్: దుండగుల కిడ్నాప్ ప్రయత్నం నుంచి ఒక మహిళ తృటిలో తప్పించుకుంది. హర్యానాలోని యమునా నగర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఒక మహిళ జిమ్‌కు వెళ్లింది. అనంతరం బయటకు వచ్చి తన కారులో కూర్చొంది. ఇంతలో నలుగురు వ్యక్తులు మెల్లగా ఆ కారును సమీపించారు. డోర్లు తీసి అందులోకి ఎక్కి ఆ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా అరవడంతోపాటు కిడ్నాపర్లపై తిరుగబడింది. దీంతో వారు భయంతో కారు దిగి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, దుండగులు మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. కిడ్నాపర్లలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు యమునా నగర్ డీఎస్పీ కమల్‌దీప్ సింగ్ తెలిపారు. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ మహిళ కిడ్నాప్ ప్రయత్నానికి కారణం ఏమిటదన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Caught On Camera: Miscreants tried to kidnap a woman in Haryana's Yamuna Nagar city yesterday
After doing gym, the woman sat in her car. 4 people came & entered her car & tried to kidnap her. One accused has been caught. Probe underway: DSP Kamaldeep Singh, Yamuna Nagar pic.twitter.com/XvuN22yfWy
— ANI (@ANI) January 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

