కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ ఆఫీసు వద్ద ఇవాళ ఓ పోలీసు కాల్పులు జరిపాడు. పార్క్ సర్కస్ ఏరియాలో ఉన్న ఆ ఆఫీసు ముందు ఓ పోలీసు పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఓ మహిళ మృతిచెందింది. అయితే ఆ తర్వాత ఆ పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు. హై కమిషన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. దాంతో బైక్పై వెళ్తున్న మహిళకు బుల్లెట్ దిగింది. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఫైరింగ్ వల్ల టెన్షన్ వాతావరణం నెలకొన్నది. కొన్ని రౌండ్ల కాల్పుల తర్వాత ఆ పోలీసు తన తలలో కాల్చుకున్నాడు. ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.