న్యూఢిల్లీ : గాయని అల్కా యాగ్నిక్ మధురంగా ఆలపించిన ఆప్ కా ఆనా సాంగ్‌కు ఓ మహిళ సైకిల్ తొక్కుతూ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మహిళ ఓవైపు సైకిల్ తొక్కుతూనే తన చేతులతో అద్భుత డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించింది. బుస్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 51 లక్షల మంది వీక్షించారు.
ఆమె పెర్ఫామెన్స్‌కు పలువురు యూజర్లు ఫిదా కాగా, ఆమె భద్రతపై మాత్రం పెద్దసంఖ్యలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాన్స్ సంగతి తరవాత మీరు డ్యాన్స్ చేస్తూ కిందపడితే ఇంజెక్షన్‌తో డాక్టర్ మీ దగ్గరికి వస్తారని ఓ నెటిజన్ చురకలు వేయగా, ఆమె సైకిల్‌పై మెరుగ్గా బ్యాలెన్స్ చేస్తూ క్రేజీ స్టెప్స్‌తో ఆకట్టుకుందని మరో యూజర్ కితాబిచ్చారు. ఇక 2000 సంవత్సరంలో విడుదలైన కురుక్షేత్ర మూవీలో ఆప్ కా ఆనా సాంగ్‌ను అల్కా యాగ్నిక్, కుమార్ సాను ఆలపించారు.