Ranjit Savarkar | సావర్కర్ క్షమాపణలు చెప్పినట్టు సాక్ష్యాధారాలతో నిరూపించాలి.. రాహుల్‌కు రంజిత్ సావర్కర్ సవాల్
Ranjit Savarkar | కోర్టు తీర్పుతో ఎంపీ (Mp)గా అనర్హత వేటు పడిన నేపథ్యంలో వీర్ సావర్కర్ (Veer Savarkar)పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై తాజాగా సావర్కర్ మనవడు (Veer Savarkar grandson ) రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) స్పందించారు. తన వ్యాఖ్యలకు గానూ రాహుల్ మాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Ranjit Savarkar | పరువు నష్టం కేసులో దోషిగా తేలి రెండేండ్లు జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటు వంటి పరిణామాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కొత్త చిక్కులో పడ్డారు. లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీ (Mp)గా అనర్హత వేటు వేసిన నేపథ్యంలో వీర్ సావర్కర్ (Veer Savarkar)పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సావర్కర్ మనవడు (Veer Savarkar grandson ) రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) స్పందించారు. కాంగ్రెస్ నేతలు, రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సావర్కర్ (Savarkar)పై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతనిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేస్తానని తెలిపారు. ఇదే సందర్భంలో రాహుల్‌కు రంజిత్ సావర్కర్ ఓ సవాల్ విసిరారు. దేశ భక్తుడు, హిందుత్వ సిద్ధాంత కర్త అయిన వినాయక్ దామోదర్ (వీడీ) సావర్కర్.. బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు.
‘రాహుల్ గాంధీ తాను సావర్కర్‌ను కాదని, క్షమాపణలు చెప్పనని అంటున్నారు. సావర్కర్ క్షమాపణ కోరినట్టు సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చిన్న పిల్లల మాటల్లా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవడం తప్పు. ఇది చాలా పెద్ద నేరం. ఇందుకు గానూ రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి’ అని అని రంజిత్ సావర్కర్ పేర్కొన్నారు.
2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీగా అనర్హత వేటు వేశారు. ఈ అంశంపై రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పేరు సావర్కర్ (Savarkar) కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read..
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Namibia Cheetah Sasha | కూనో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత సాషా మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

