చండీగఢ్: భార్య అనుమతి లేకుండా ఆమెతో జరిగే సెల్ఫోన్ సంభాషణను భర్త రికార్డు చేయటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటమే అని పంజాబ్-హర్యానా హైకోర్టు పేర్కొన్నది. విడాకుల కేసు విచారణలో భాగంగా.. ఇలాంటి ఆధారాలను ప్రోత్సహించకూడదని ఫ్యామిలీ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఒక భర్త తన భార్యతో జరిగిన సెల్ఫోన్ సంభాషణను రహస్యంగా రికార్డు చేసి, దాన్ని ఫ్యామిలీ కోర్టులో ఆధారంగా ప్రవేశపెట్టాడు. దాన్ని ఫ్యామిలీ కోర్టు స్వీకరించింది. అలా స్వీకరించటాన్ని సవాలు చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది.