కరోనా చికిత్సకు ఐవర్మెక్టిన్ను వాడొద్దు: WHO
Ivermectin drug: కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్మెక్టిన్ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

జెనీవా: కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్మెక్టిన్ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్ కరోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తుందని, మరణం ముప్పును కూడా గణనీయంగా తగ్గిస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఆమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
అందుకే గోవా ప్రభుత్వం రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన వారందరికీ ఐవర్‌మెక్టిన్ మాత్రలను పంపిణీ చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో WHO ఐవర్ మెక్టిన్ను వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప కొవిడ్ చికిత్సలో ఐవర్మెక్టిన్ను ఉపయోగించవద్దని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

