న్యూఢిల్లీ : పదేండ్ల చిన్నారికి ప్రధాని మోదీని కలవాలనిపించింది. మెయిల్ చేస్తే రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేం ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్‌కు చేరుకున్నది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ మోదీ సావధానంగా జవాబులు చెప్పాడు. చిన్నారికి ఎన్నో చాక్లెట్లు ఇచ్చాడు. చివరకు మోదీ తాతా.. నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు..? అని ప్రశ్నించి నరేంద్ర మోదీని పగలబడి నవ్వేలా చేసింది. ఏం సమాధానం చెప్పాలో తెలియని మోదీ.. కాస్సేపు అలాగే నవ్వుతూ ఉండిపోయాడు. ఎందుకు నవ్వుతున్నాడో తెలియని ఆ చిన్నారి.. బిక్కమొగం వేసుకుని అలాగే ఉండిపోయింది. వివరాల్లోకెళితే..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ బీజేపీ ఎంపీ. ఆయన తండ్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా అప్పట్లో మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. అయితే, సుజయ్ పాటిల్ కుమార్తె 10 ఏండ్ల అనీష పాటిల్ గత కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని అనుకున్నది. తండ్రికి చెబితే మోదీ చాలా బిజీగా ఉంటారని, అపాయింట్మెంట్ ఇవ్వలేరని నచ్చజెప్పారు. దాంతో తానే మోదీ మెయిల్‌కు లేఖ రాసింది. ‘నేను మిమ్మల్ని నిజంగా కలవాలనుకుంటున్నాను’ అని సింపుల్‌గా లేఖలో తెలిపింది. ఇది చూసిన మోదీ తనను కలిసేందుకు ఆమెను ఆహ్వానించాడు.
పార్లమెంట్ వద్ద సుజయ్ పాటిల్ కనిపించగానే.. ఎక్కడ అనీషా అంటూ ఆరా తీశాడు. అక్కడే ఉన్న అనీషాకు షేక్‌హ్యాండిచ్చి.. పక్కనే ఉన్న తన చాంబర్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చాడు. ఆ పాప అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. వీరి సంభాషణ 10 నిమిషాల పాటు కొనసాగింది. చివరగా.. మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు మోదీ తాతా..? అని అడగ్గానే.. ఒక్కసారి పడీపడీ నవ్వాడు. పక్కనున్న వారు కూడా మోదీతో జత కలిశారు. వాళ్లెందుకు నవ్వుతున్నారో తెలియని ఆ చిన్నారి.. పాపం బిక్క మొగం వేసుకుని ఉండిపోయింది. ఏమయితేనేం.. మోదీని కలిశానన్న సంతోషంతో ఇంటికి వెళ్లిపోయింది.
హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
నష్టాల్లో నుంచి లాభాల్లోకి ఐఆర్సీటీసీ
మోదీకి చెక్ పెట్టేందుకు విపక్షాల సన్నాహాలు
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..