కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడిస్తారు : ఎంపీ నామా నాగేశ్వర రావు

న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జగడాలు ఉన్నట్లు మంత్రి చెబుతున్నారని, కానీ అలాంటి సమస్య ఉంటే చెప్పండి మేం పరిష్కరిస్తామన్నారు. మా మధ్య జగడాలు లేవు అని, సీఎం కేసీఆర్, సీఎం జగన్‌లు.. సమస్యలను పరిష్కరించేందుకు.. మీవద్దకు అనేక సార్లు వచ్చారన్నారు. పెండింగ్ అంశాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని, ఇది ఆంధ్రాకు లింకులేని అంశమని ఎంపీ నామా డిమాండ్ చేశారు.
రాష్ట్ర పునర్ విభజనపై ఏపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు ప్రశ్న వేశారు. ఏపీ విభజన చట్టం అమలు తీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు అయ్యాయో చెప్పాలన్నారు. బిల్లు పాసైనప్పుడు ఏపీకి స్పెషల్ స్టాటస్ ఇస్తామని మేజర్ హామీ ఇచ్చారని, దాని గురించి చెప్పాలంటూ ఎంపీ రామ్మోహన్ డిమాండ్ చేశారు.
హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. కేంద్రం వద్ద ఎటువంటి సమస్యలు పెండింగ్‌లో లేవన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుఊ.. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, విభజన యాక్ట్‌ను కేవలం పదేళ్ల కోసం ఏర్పాటు చేశారని, కానీ విభజన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి స్పెషల్ క్యాటగిరీ స్టాటస్ ఇవ్వాలని ఎంపీ మిథున్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

