Rahul Gandhi | కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై చర్యలు: రాహుల్ గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఇలాంటివి చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలుంటాయి. ఇది నా హామీ’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు జారీ చేసిన పన్ను డిమాండ్ల రద్దు కోసం సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నదని తెలిపారు. ఐటీ నోటీస్‌ను ‘ఉగ్ర పన్ను’గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

