క్లౌడ్ బస్ట్.. టెక్నికల్ ఫాల్ట్.. బర్డ్ హిట్.. మిస్సైల్ అటాక్

హైదరాబాద్: త్రివిధ దళాధిపతి, జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎలా కూలింది ? అత్యంత సురక్షితమైన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఏంటి ? ఈ అంశం గురించి వైమానిక నిపుణులు పలు కారణాలను చెబుతున్నారు. క్లౌడ్ బస్ట్ లేదా టెక్నికల్ ఫాల్ట్ లేదా బర్డ్ హిట్ లేదా మిస్సైల్ అటాక్ లాంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. హెలికాప్టర్ క్రాష్‌కు రీజన్ ఏందన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా తయారీకి చెందిన వీ5 హెలికాప్టర్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. దీన్ని వెయిట్ లిఫ్టింగ్ కోసం.. అటాకింగ్ కోసం వాడుతారు. వీ5 చాలా నమ్మదగ్గదన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి ఫిట్నెస్ ఎక్కువే అన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పలుమార్లు ద్రువీకరించింది. వర్క్ హార్స్ అన్న నిక్‌నేమ్ కూడా దీనికి ఉంది.
హెలికాప్టర్ ఎప్పుడు ఎగిరినా.. దానికి ఫ్లయింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. అది కొన్ని క్షణాల పాటు ఎగిరినా.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే ఇవాళ జరిగిన ప్రమాదానికి.. వెదరే కారణమన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ వాయుసేన ఈ ఘటనపై అప్పుడే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నారు. అయితే ఏదైనా మానవ తప్పిదం ఉందా లేక మెషీన్లో ఏదైనా లోపం తలెత్తిందా అన్న కోణంలోనూ విచారణ చేపడుతారు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో పరిశీలిస్తారు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. అంత రేంజ్లో మంటలు రావడం కొంత అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం నీలగిరిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

