శనివారం 23 జనవరి 2021
National - Dec 03, 2020 , 01:05:28

పెండ్లైన రెండు గంటలకే పెటాకులు

పెండ్లైన రెండు గంటలకే పెటాకులు

గోరఖ్‌పూర్‌: యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన భువాల్‌ నిషాద్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నవవధువు అత్తవారింటికి వెళ్లడానికి సిద్ధమైంది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. పెండ్లి కూతురు తల్లిదండ్రులు వరుడికి ఏదో జబ్బు ఉందని అనుమానించారు. వివాహం రద్దు చేయాలని కోరారు. రెండు గంటలపాటు వాగ్వివాదం జరిగింది. దీంతో చేసేది లేక పెద్దలు పెండ్లిని రద్దు చేశారు. అలా పెండ్లి జరిగిన రెండు గంటల్లోనే అది పెటాకులైంది.


logo