Udhayanidhi Stalin | మోదీని ఇకపై 28 పైసల ప్రధాని అని పిలుద్దాం: తమిళ మంత్రి ఉదయనిధి స్టాలిన్
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 పైసల ప్రధాని (28 paisa PM) అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చెన్నై: ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 పైసల ప్రధాని (28 paisa PM) అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే పన్ను రూపంలో రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం 28 పైసలు మాత్రమే తిరిగి మనకు వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే రాష్ట్రాలకే అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మనం మోదీని 28 పైసల ప్రధాని అని పిలుద్దామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనాథపురం, థేనిలో ఉదయనిధి ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీయడానికే కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని (NEP) తీసుకొచ్చిందని ఆరోపించారు. అదేవిధంగా నిధుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలు, నీట్ నిషేధం వంటి అంశాల్లో తమిళనాడుపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. మధురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్ (AIIMS Madurai) హాస్పిటల్‌కు సంబంధించి శంకుస్థాపనకు ఉపయోగించిన ఇటుకను ప్రదర్శించారు. నీట్ నిర్మాణం ముందుకు సాగడం లేదనడానికి ఇదే నిదర్శమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ప్రధాని తమిళనాడు పర్యటనకు వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 28 Paisa PM
- AIIMS Madurai
- BJP
- DMK
RELATED ARTICLES
తాజా వార్తలు
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

