Lalit Modi: మేం పరారీలో ఉన్న నేరస్థులం.. మాల్యా బర్త్డే వీడియోలో లలిత్ మోదీ
Lalit Modi: మేం ఇద్దరం భారత్కు చెందిన అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ అన్నారు. విజయ్ మాల్యా బర్త్డే పార్టీలో తీసిన ఓ వీడియోను తాజాగా తన ఇన్స్టాలో పోస్టు చేశాడతను.
లండన్: వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇటీవల లండన్లో 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ(Lalit Modi) పాల్గొన్నారు. దానికి చెందిన ఓ వీడియోను గతంలో ఆయన పోస్టు చేశారు. అయితే తాజాగా మరో వీడియోను కూడా ఆయన తన ఇన్స్టా అకౌంట్లో రిలీజ్ చేశారు. ఆ వీడియోపై దుమారం చెలరేగుతున్నది. మేం ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ ఆ వీడియోలో వ్యాఖ్యలు చేశారు. కానీ విజయ్ మాల్యా మాత్రం ఆ వీడియోలో ఎటువంటి కామెంట్ చేశారు. ఇంటర్నెట్లో మరో సంచలనం చేస్తున్నానని, నా స్నేహితుడు మాల్యాకు హ్యాపీ బర్త్ డే అంటూ లలిత్ మోదీ పేర్కొన్నారు.
లలిత్ మోదీ పోస్టు చేసిన తాజా వీడియోపై విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ యూజర్లు లలిత్ మోదీ వైఖరిని తప్పుపట్టారు. పరారీలో ఉన్న లలిత్ మోదీని కర్మ వెంటాడుతుందని, ఇవాళ కాకపోతే, రేపైనా అని కొందరన్నారు. భారతీయ చట్టాలను కించపరిచే రీతిలో లలిత్ మోదీ వ్యాఖ్యలు చేసినట్లు ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైలెంట్గా ఉంటే బలమైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవచ్చు అన్న సందేశం వస్తుందని కొందరన్నారు.
డిసెంబర్ 16వ తేదీన లలిత్ మోదీ బర్త్డే పార్టీని ఆర్గనైజ్ చేశారు. లండన్లోని బెల్గ్రేవ్ స్క్వేర్లో ఉన్న ఆరు బెడ్ రూమ్ల ఇంట్లో ఆ పార్టీ ఏర్పాటు చేశాడు. విజయ్ మాల్యా దోస్తులు ఆ పార్టీ కోసం ఇండియా నుంచి లండన్కు వెళ్లారు. ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా, యాక్టర్ ఇడ్రిస్ ఎల్బా, వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ ఓనర్ అయిన విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లారు. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని వేల కోట్లు ఎగవేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన కేసులో 2010లోనే లలిత్ మోదీ దేశాన్ని విడిచి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

