Train derail : శాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు (Train no.18029) తృటిలో పెనుప్రమాదం తప్పింది. రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే లోకో పైలట్ అప్రమత్తమై రైలును వెంటనే నిలిపేయడంతో పెనుముప్పు తప్పినట్లయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగర సమీపంలోగల కాలమ్నా రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన కొన్ని రైళ్లను నిలిపేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగీలను సరిచేసి మళ్లీ ట్రాక్ ఎక్కించే పనులు కొనసాగుతున్నాయి. ఈ పునరుద్ధరణ పనులు పూర్తయితే రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Maharashtra: Two coaches of a train (18029) CSMT Shalimar Express derailed near kalamna station near Nagpur. No injuries have been reported.
Restoration work is underway. pic.twitter.com/fmCBf0c4N7
— ANI (@ANI) October 22, 2024