Swati Maliwal case | కేజ్రీవాల్ ఇంట్లోని సీసీ టీవీ డీవీఆర్‌ను సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు.. Video
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్ (CCTV DVR) ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలోని ఫుటేజ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Swati Maliwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్ (CCTV DVR) ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలోని ఫుటేజ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్ నివాసం నుంచే బిభవ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాగా బిభవ్ అరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడింది. కేజ్రీవాల్‌ను మరో కేసులో ఇరికించడానికి బీజేపీ ప్లాన్ ప్రకారం స్వాతిమాలివాల్ను కేజ్రీవాల్ నివాసానికి పంపిందని ఆరోపించారు. కేజ్రీవాల్ కలువకపోవడంతో అతనిపై పీఏపై ఆరోపణలు చేసిందని విమర్శించారు.
కాగా, సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన తనపట్ల ఆయన పీఏ దురుసుగా ప్రవర్తించాడని స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చెంపపై కొట్టాడని, కాలితో తన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కేజ్రీవాల్ నివాసంలో సీసీ కెమెరాను సీజ్ చేసి తీసుకెళ్లారు.
#WATCH | AAP MP Swati Maliwal assault case: Delhi Police seized CCTV DVR from the residence of Delhi CM Arvind Kejriwal
Delhi Police yesterday arrested Delhi CM Arvind Kejriwal’s aide Bibhav Kumar in this case. https://t.co/iH1DkZoAIm pic.twitter.com/wsQEWpDF8s
— ANI (@ANI) May 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

