లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు నిర్వహించిన బాలికల మారథాన్‌లో కలకలం చెలరేగింది. లడ్కీ హూన్, లడ్ సక్తీ హూన్ (బాలికను, పోరాటమూ చేయగలను) అనే పేరుతో స్థానిక కాంగ్రెస్ నేత, పట్టణ మాజీ మేయర్ సుప్రియా అరోన్ బాలికల మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్‌కు బాలికలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రోడ్డంతా బాలికలతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో పరుగు మొదలవగానే వెనుక ఉన్న బాలికలు తోయడంతో ముందున్న బాలికలు రోడ్డు మీద పడిపోయారు.
ఈ సందర్భంగా కాసేపు కలకలం చెలరేగింది. కానీ అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో భారీ మారథాన్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మారథాన్‌లో పాల్గొన్న బాలికల్లో చాలామంది మాస్కులు ధరించలేదని పలువురు మండిపడుతున్నారు. దీనిపై మారథాన్ నిర్వాహకురాలు సుప్రియా ఆరోన్ స్పందించారు. వైష్ణోదేవి ఆలయానికి కూడా కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేలమంది వెళ్లారని, దానిపై ఏం మాట్లాడుతారని ఎదురు ప్రశ్నించారు.
#WATCH | Stampede occurred during Congress' 'Ladki hoon, Lad Sakti hoon' marathon in Bareilly, Uttar Pradesh today pic.twitter.com/nDtKd1lxf1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022