Stage collapse: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణంలో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) బహిరంగ సభ నిర్వహించింది. ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్భర్ అధ్యక్షతన సభ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాజ్భర్ సహా ఎస్బీఎస్పీ నేతలంతా సభా వేదికపై ఆసీనులై ఉండగా.. ఒక్కసారిగా ఆ వేదిక వెనుక భాగం కుప్పకూలింది.
దాంతో ముఖ్య నేతల వెనుక వరుసలో కూర్చుని ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా కిందపడిపోయారు. భారీ శబ్ధంతో వేదిక కూలిపోవడంతో ముందు వరుసలో కూర్చున్న నేతలకు ముందుగా అర్థం కాలేదు. తర్వాత వెనుదిరిగి చూడగా వేదిక కూలి నేతలంతా కిందపడి ఉన్నారు.
దాంతో కార్యకర్తలు, పోలీసులు హుటాహుటిన వేదిక దగ్గరికి పరుగులు తీసి పడిపోయిన నేతలకు సాయమందించారు. ఈ ఘటనలో కొందరు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Stage collapsed during a public meeting of Suheldev Bharatiya Samaj Party (SBSP) Chief OP Rajbhar in Uttar Pradesh’s Sitapur.
More details awaited. pic.twitter.com/zWE1uMTESR
— ANI (@ANI) January 28, 2024