Satya Pal Malik | సత్యపాల్ మాలిక్‌ను అరెస్టు చేయలేదు : ఢిల్లీ పోలీసులు
Satya Pal Malik | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు శనివారం వెళ్లారు. సీబీఐ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే సత్యపాల్ మాలిక్ పీఎస్‌కు వెళ్లడంతో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై ఆర్కే పురం పోలీసులు స్పందించారు. సత్యపాల్ మాలిక్‌ను అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Satya Pal Malik | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు శనివారం వెళ్లారు. సీబీఐ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే సత్యపాల్ మాలిక్ పీఎస్‌కు వెళ్లడంతో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై ఆర్కే పురం పోలీసులు స్పందించారు. సత్యపాల్ మాలిక్‌ను అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
సత్యపాల్ మాలిక్ తన ఇంటి వద్ద తన మద్దతుదారులతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తన మద్దతుదారులతో కలిసి సత్యపాల్ మాలిక్ ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే అతన్ని అరెస్టు చేయలేదని, ఇష్టపూర్వకంగానే సత్యపాల్ మాలిక్ పోలీసు స్టేషన్ నుంచి ఆయన నివాసానికి తిరిగి వెళ్లారని ఆర్కే పురం పోలీసులు పేర్కొన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మోదీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దేశ భద్రత విషయంలో మోదీ అనుసరించిన నిర్లక్ష్య వైఖరి, పుల్వామా ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ తీరును విమర్శించారు. సైనికులను రోడ్డు మార్గాన తరలించడం అంత క్షేమం కాదని, వారిని విమానాలలో పంపాలని చేసిన విజ్ఞప్తిని హోం శాఖ తిరస్కరించడం, టెర్రరిస్టు ముఠాలు చేసిన దాడిలో 40 మంది సైనికులు మరణించడాన్ని అయన వివరించారు. ఈ దుర్ఘటనను మోదీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సత్యపాల్‌మాలిక్ వివరించారు. అదే ఇంటర్వ్యూలో రిలయన్స్ ప్రాజెక్టు అనుమతి కోసం తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలకు చేశారు. దీనికి సంబంధించి ప్రశ్నించడానికే సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసి ఈ నెల 28న హాజరుకావాలని ఆదేశించినట్టు భావిస్తున్నారు.
ఏమిటీ రిలయన్స్ వివాదం?
సత్యపాల్‌మాలిక్ జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆరెస్సెస్ నేత రామ్‌మాధవ్ ఆయనను కలిసి రద్దు చేసిన రిలయన్స్ కంపెనీ ఆరోగ్యబీమా పథకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి మాలిక్ తిరస్కరించారు. అయితే ఆ పథకానికి అనుమతి ఇస్తే రూ.300 కోట్ల లంచం ఇస్తానని తనకు ఆఫర్ చేశారని మాలిక్ ఇటీవల ‘ది వైర్’ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దీనిపై రామ్‌మాధవ్ మండిపడ్డారు. రిలయన్స్ ఇన్సూరెన్స్ పథకం గురించి తాను మాలిక్‌ను అడగలేదని, అసత్య ఆరోపణలతో తనకు నష్టం కలిగించిన ఆయనపై పరువు నష్టం దావా వేయనున్నట్టు హెచ్చరించారు. కాగా, తాను సత్యం వైపే ఉంటానని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

