Manu Bhaker : ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో రెండు కాంస్య పతకాలు (Bronze Medals) గెలిచిన భారత షూటర్ (Indian Shooter) మనూభాకర్ (Manu Bhaker).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా అని చెప్పారు.
భారత పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు అని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనూభాకర్ పిలుపునిచ్చారు. అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ మంచి అనుకుంటే వాళ్లకే ఓటు వేయాలని సూచించారు. కాగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Olympic medalist Manu Bhaker casts her vote at a polling station in Jhajjar for the #HaryanaElection2024 pic.twitter.com/jPXiQ2zwJf
— ANI (@ANI) October 5, 2024