ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఔరంగాబాద్ జిల్లాలోని నరెగావ్ పట్టణంలో కుంభవృష్టి కురిసింది. దాంతో పట్టణం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వీధులు నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఆవాసాల్లోకి భారీగా వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల జనం ఇండ్ల నుంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ వరదలు, వర్షానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.